Pawan’s Vakeel Saab mania started

Tuesday,March 30,2021 - 12:35 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్మాల్ గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న 'వకీల్ సాబ్' సినిమాకు సంబంధించి హంగామా మొదలైంది. సినిమా ప్రమోషన్స్ ఎప్పుడెప్పుడు మొదలవుతాయా ? అని ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఫ్యాన్స్ నిన్నటి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

నిన్న థియేటర్స్ లో విడుదలైన వకీల్ సాబ్ ట్రైలర్ కి బ్రహ్మరథం పట్టారు అభిమానులు. మూడేళ్ళ తర్వాత స్క్రీన్ పై తమ అభిమాన హీరోని చూసి మురిసిపోతూ సంబరాలు చేసుకున్నారు. సినిమా రిలీజ్ రోజు కనబడే హంగామా నిన్న ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కే చూపించి తమ పవర్ చూపించారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

నిన్న సాయంత్రం కొన్ని థియేటర్స్ లో ప్లే అయిన ట్రైలర్ ప్రస్తుతం యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతూ మిలియన్ వ్యూస్ కొల్లగొడుతూ రికార్డులు సృష్టిస్తోంది. సినిమాలో వచ్చే కోర్ట్ సీన్స్ తో పవన్ కళ్యాణ్ హీరోఇజం షార్ట్స్ తో విడుదలైన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో భారీ వ్యూస్ సాధిస్తూ సినిమాపై సరికొత్త అంచనాలు నెలకొలుపుతుంది.

బోణీ కపూర్ సమర్పణలో దిల్ రాజు , శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. ఉగాది కానుకగా ఏప్రిల్ 9 న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మరి ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'వకీల్ సాబ్ సినిమాతో ఎలాంటి సునామి సృష్టిస్తాడో వేచి చూడాలి.