Pawan new movie rumored to be Billa-Ranga

Monday,October 26,2020 - 12:25 by Z_CLU

Pawan Kalyan నుంచి దసరా సందర్భంగా మరో కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ ప్రీ-లుక్ లాంటిది కూడా రిలీజ్ చేశారు. దానికి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఇప్పుడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కొంతమంది బిల్లా, రంగా అనే పదాలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ సినిమాకు Billa-Ranga అనే టైటిల్ పెట్టే అవకాశం ఉందంటూ గాసిప్స్ వస్తున్నాయి.

ఇది చిరంజీవి టైటిల్. గతంలో ఈ టైటిల్ తో చిరంజీవి-మోహన్ బాబు సినిమా చేశారు. ఇప్పుడిదే టైటిల్ ను పవన్ కొత్త సినిమా కోసం అనుకుంటున్నారట.

మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా రాబోతోంది. ఇందులో బిల్లా పాత్రలో పవన్, రంగా పాత్రలో Rana కనిపిస్తారని అంటున్నారు. పవన్ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నాడు.

Also read - పవన్ ఖాతాలో మరో పెద్ద సినిమా