Pawan Kalyan wishes to ‘Uppena’ Team

Thursday,February 11,2021 - 12:30 by Z_CLU

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమౌతున్న 'ఉప్పెన' సినిమా రేపే గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేనల్లుడు వైష్ణవ్ ని అలాగే టీం అందరిని అభినందించి ఆల్ ది బెస్ట్ చెప్పాడు పవర్ స్టార్. తాజాగా సాగర్ చంద్ర డైరెక్షన్ లో పవన్ నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్ లో పవర్ స్టార్ ని కలిసి విషెస్ అందుకున్నారు 'ఉప్పెన' టీం.

'ఉప్పెన' సినిమాకు సంబంధించి కొంత కంటెంట్ చూసిన పవన్ మాట్లాడుతూ " 'ఉప్పెన' మన చుట్టూ ఉండే జీవితాల్ని చూపించే చిత్రం అనిపిస్తుంది. 'మన చుట్టూ ఉన్న పరిస్థితులను కథగా తెర మీదకు తీసుకువచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు'. వైష్ణవ్ తేజ్ హీరోగా మొదటి సినిమాతోనే మంచి కథతో పాటు నటుడిగా గుర్తింపు అందుకునే పాత్రను ఎంచుకున్నాడు. మొదటి అడుగులోనే సవాల్ తో కూడుకున్న పాత్రను తీసుకున్న వైష్ణవ్ తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతాడు. బుచ్చి బాబు ఈ కథను ఎంతో సమర్థంగా తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మంచి కథతో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబు కి ఈ కథను నమ్మి నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ , రవి గార్లకి, సుకుమార్ గారికి అలాగే టీం అందరికీ నా అభినందనలు. 'ఉప్పెన' ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. అని అన్నారు.