Pawan’s Vakeel Saab entered into final schedule

Wednesday,December 16,2020 - 02:38 by Z_CLU

పవర్ స్టార్ Pawan Kalyan హీరోగా నటిస్తున్న Vakeelsaab సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. లాక్ డౌన్ అనంతరం ఒక షెడ్యుల్ పూర్తి చేసిన యూనిట్ ఇవాళ్టి నుండి ఫైనల్ స్టార్ట్ చేసింది.

ప్రెజెంట్ పవన్ తో యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. లొకేషన్ లో చెక్ షర్ట్ వేసుకొని కుర్చీలో కూర్చున్న పవర్ స్టార్ స్టిల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కాకపోతే అది లీక్డ్ పిక్. ఈ నెలాఖరుతో సినిమాకు గుమ్మడికాయ కొట్టబోతున్నారు.

బోనీకపూర్ సమర్పణలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. అంజలి, నివేత థామస్ కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన సాంగ్ ఇప్పటికే బాగా పాపులర్ అయింది. త్వరలోనే టీజర్ పై అప్డేట్ రానుంది.

Also Check - వకీల్ సాబ్ గురించి శృతిహాసన్