Pawan Kalyan tested positive for corona

Friday,April 16,2021 - 05:26 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కరోనా సోకింది. 2 రోజుల కిందట నిర్వహించిన టెస్టుల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే పవన్ కు ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశారు.

వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఎటెండ్ అయ్యారు పవన్. అంతకంటే ముందు ఎన్నికల ప్రచారం కోసం తిరుపతి వెళ్లారు. ఆ టైమ్ లో కాస్త బాడీ పెయిన్స్ అనిపించడం, పవన్ స్టాఫ్ లో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో పవన్ కూడా టెస్ట్ చేయించుకున్నారు. అప్పుడు ఆయనకు నెగెటివ్ వచ్చింది.

అయినప్పటికీ ఎందుకైనా మంచిదని పవన్ క్వారంటైన్ లోనే ఉన్నారు. ఆ టైమ్ లో మళ్లీ జ్వరం, బాడీ పెయిన్స్ రావడంతో మళ్లీ టెస్ట్ చేశారు. ఈసారి పాజిటివ్ వచ్చింది.

పవన్ కు కరోనా సోకిందని తెలిసిన వెంటనే ఆయన ఫామ్ హౌజ్ లో ట్రీట్ మెంట్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఖమ్మంకు చెందిన ఓ స్పెషలిస్ట్, పవన్ కు దగ్గరుండి ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశారు. అపొలోకు చెందిన డాక్టర్స్ టీమ్ కూడా పవన్ ను ట్రీట్ చేస్తోంది.

pawan kalyan corona zeecinemalu 1

ప్రస్తుతానికి పవన్ కు ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరినట్టు డాక్టర్లు గుర్తించారు. దానికి సంబంధించి ట్రీట్ మెంట్ మొదలుపెట్టారు. ప్రస్తుతం పవన్ హెల్త్ కండిషన్ నిలకడగా ఉన్నట్టు డాక్టర్లు ప్రకటించారు.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics