Pawan Kalyan , Surender Reddy movie announced !

Thursday,September 02,2021 - 04:28 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా అన్నది ఎప్పటి నుండో వింటున్న వార్తే. గతేడాది పవన్ పుట్టిన రోజు సందర్భంగా సురేందర్ రెడ్డి , నిర్మాత రామ్ తాళ్ళూరి విషెస్ చెప్తూ ప్రాజెక్ట్ గురించి హింట్ ఇచ్చారు. ఈ ఏడాది కూడా పవన్ కి విషెస్ చెప్పారు. కానీ ఈసారి తమ కాంబో సినిమాను కన్ఫర్మ్ చేసి అఫీషియల్ గా ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశారు.

PawanKalyan-SurenderReddy-Movie-Announced

హైదరాబాద్ సిటీ విజువల్స్ తో గన్ చూపిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. 'యథా కాలమ్ ... తథా వ్యవహారమ్' అంటూ ఓ క్యాప్షన్ పెట్టి సినిమా ఎలా ఉండబోతుందో కాన్సెప్ట్ పోస్టర్ తో హింట్ ఇచ్చారు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని అర్థమవుతుంది. ఈ సినిమాలో సురేందర్ రెడ్డి పవన్ ని ఎలా చూపించబోతున్నాడు ? సిటీ , గ్యాంగులు , గ్యాంగ్ స్టర్ ఇలాంటి కథతో సినిమా తెరకెక్కనుందా ? అనే ప్రశ్నలు ఎనౌన్స్ మెంట్ తోనే మొదలయ్యాయి.

SRT ఎంటర్టైన్మెంట్స్ బేనర్ పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ, మాటలు అందించనున్నాడు. సినిమాలో మిగతా కాస్టింగ్ గురించి కానీ టెక్నీషియన్స్ గురించి కానీ ఎక్కడా చెప్పలేదు మేకర్స్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇక సురేందర్ రెడ్డి కూడా అఖిల్ తో 'ఏజెంట్' సినిమా చేస్తున్నాడు. పవన్ సెట్స్ పై పెట్టిన సినిమాలు పూర్తి చేసే లోపు సురేందర్ రెడ్డి 'ఏజెంట్' సినిమా కంప్లీట్ చేసి పవన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెడతాడు.

  - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics