Pawan Kalyan , Sujeeth movie launch date fix ?

Friday,January 27,2023 - 02:39 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో సుజీత్ డైరెక్షన్ మూవీ ఒకటి. 'సాహొ' తర్వాత సుజీత్  గ్యాప్ తీసుకొని పవన్ కోసం ఓ అదిరిపోయే గ్యాంగ్ స్టర్ స్టోరీ రెడీ చేసి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై దానయ్య నిర్మించబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఎనౌన్స్ అయింది. ప్రీ లుక్ పోస్టర్ తో సినిమాను ఎనౌన్స్ చేసి #OG అనే క్యాప్షన్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు.

ఈ నెల 30న హైదరాబాద్ లో సినిమా  గ్రాండ్ గా లాంచ్ అవ్వబోతుందని సమాచారం. ఈ మేరకు ప్లానింగ్ జరుగుతుందని తెలుస్తుంది. పవన్ తొలిసారి తమ బేనర్ లో చేస్తున్న సినిమా కావడంతో సినిమా ప్రారంభ వేడుకను భారీ ఎత్తున చేయబోతున్నారట దానయ్య.

సుజీత్ ఇప్పటికే పవన్ సినిమాకి సంబంధించి స్క్రిప్టింగ్  కంప్లీట్ చేసేశాడు. లొకేషన్స్ . కాస్టింగ్ ఫైనల్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. మరి పవన్ కి వీరాభి అయిన సుజీత్ పవర్ స్టార్ ను ఎలాంటి గ్యాంగ్ స్టర్ గా చూపిస్తాడా ? అంటూ పవన్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

'సాహొ' తో సుజీత్ ఆశించిన విజయం అందుకోలేకపోయినా ఒకే ఒక్క సినిమా అనుభవంతో  స్టైలిష్  యాక్షన్ సినిమాను బాగా డీల్ చేశాడనే అభినందనలు అందుకున్నాడు. మరి పవర్ స్టార్ తో సుజీత్ ఎలాంటి హిట్ అందుకుంటాడో ? చూడాలి.