Pawan Kalyan , Sai Dharam Tej’s movie shoot begins

Wednesday,February 22,2023 - 11:55 by Z_CLU

 కొన్ని నెలలుగా అందరూ మాట్లాడుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan  , సుప్రీం హీరో సాయి ధరం తేజ Sai  Tej  కాంబినేషన్ క్రేజీ మూవీ ఈరోజే సెట్స్ పైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ మోడ్రన్ గాడ్ గా నటిస్తున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ ఓ చలాకీ కుర్రాడిగా నటిస్తున్నాడు. హైదరాబాద్ మణికొండలో పవన్ , తేజ్ ల సన్నివేశాలతో షూటింగ్ మొదలైంది.

ఈ సినిమా కోసం పవన్ దాదాపు నెల రోజులు డేట్స్ ఇచ్చారు. తమిళ్ లో సూపర్ హిట్టయిన 'వినోదాయ సీతమ్' (Vinodaya Sitham)  కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఒరిజినల్ లో సముద్రఖని చేసిన పాత్రను పవన్ తెలుగులో చేయబోతున్నాడు. వారం రోజుల పాటు హైదరాబాద్ లో పవన్ , తేజ లపై ఘాట్ చేసి ఆ తర్వాత సాయి ధరం తేజ పై ఓ సాంగ్ తీయనున్నారు. ఎక్కువ బ్రేకులు లేకుండా తక్కువ రోజుళ్లో ఘాట్ కంప్లీట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు.

జీ స్టూడియోస్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు TG విశ్వప్రసాద్ నిర్మాత. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజర్.

   
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics