Pawan Kalyan ready with #PSPK27 First look !

Friday,February 26,2021 - 03:39 by Z_CLU

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ఛార్మినార్ సెట్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రాబోతుంది. పవన్ కళ్యాణ్ యుద్ద వీరుడుగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ తో లుక్ ని మార్చ్ 11 న శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. తాజాగా ఈ విషయన్ని అధికారికంగా ప్రకటించారు.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'హరి హర వీర మల్లు' అనే టైటిల్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. మరి మేకర్స్ ఇదే టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా ? లేదా మరో టైటిల్ ఏమైనా కన్సిడర్ చేస్తారా ? వేచి చూడాలి.

మెగా సూర్య ప్రొడక్షన్ బేనర్ పై AM రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.