Pawan Kalyan -Rana Movie Release on September ?

Friday,February 12,2021 - 04:23 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్ చంద్ర దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్లో వినాయకచవితి కానుకగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట.

సెప్టెంబర్ రిలీజ్ డిసైడ్ అయి షూటింగ్ చకచకా చేస్తున్నారని ,  ఐదు నెలల్లో టోటల్ షూట్ ఫినిష్ చేసి రిలీజ్ డేట్ అందుకోవడానికి సిద్దమవుతున్నారని తెలుస్తుంది. త్వరలోనే మేకర్స్ ఈ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. మలయాళం బ్లాక్ బస్టర్ హిట్  'అయ్యప్పనుమ్ కోశియమ్' సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ సినిమా కోసమే చేయబోయే మిగతా సినిమాలను పక్కన పెట్టి డేట్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.

సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత నాగ వంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.