Pawan Kalyan in Sagar Chandra direction

Sunday,October 25,2020 - 11:40 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి సడెన్ సర్ ప్రైజ్ వచ్చేసింది. వకీల్ సాబ్ టీజర్ వస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు. దానికి సాయంత్రం వరకు టైమ్ ఉంది. ఇక క్రిష్ సినిమా నుంచి ఏదైనా వస్తుందేమో అని చూశారు. దానికి ఇంకా టైమ్ ఉంది. అయితే ఎవరూ ఊహించని విధంగా పవన్ నుంచి ఏకంగా కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.

అవును.. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై పవన్ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. దసరా సందర్భంగా ఈ మూవీని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

Sagar Chandra (సాగర్ చంద్ర) దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఇందులో Pawan Police గా కనిపించబోతున్నాడు.

నిజానికి ఇది మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్. కాకపోతే ఆ విషయాన్ని ఈరోజు చెప్పలేదు.

Also Read - వకీల్ సాబ్ ఊపందుకున్నాడు