Ori Devuda Trailer Review

Friday,October 07,2022 - 05:13 by Z_CLU

విశ్వక్ సేన్ హీరోగా విక్టరీ వెంకటేష్ మోడరన్ గాడ్ క్యారెక్టర్ లో నటించిన 'ఓరి దేవుడా' ట్రయిలర్ రిలీజైంది. సినిమాలో విశ్వక్ సీన్ పెళ్ళైన కుర్రాడిలా కనిపించనున్నాడు. తన పాత్రలో విశ్వక్ సేన్ ఒదిగిపోయి నటించాడని అర్థమవుతుంది.

సినిమాలో వెంకటేష్ స్పెషల్ కేరెక్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ట్రయిలర్ చూస్తే అర్థమవుతుంది. తన మార్క్ డైలాగ్స్ , నటన తో వెంకటేష్ సినిమాకు హైలైట్ గా నిలవనున్నాడని తెలుస్తుంది. ట్రయిలర్ లో విధు విజువల్స్ , లియోన్ జేమ్స్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ఫ్రెండ్ క్యారెక్టర్ చెప్పే డైలాగ్ కామెడీ వర్కౌట్ అయింది. సినిమాలో అనిరుధ్ ఓ సాంగ్ పాడాడు ట్రెయిలర్ లో ఆ సాంగ్ బీట్ హైలైట్ గా నిలిచింది. రీమేక్ సినిమా అయినప్పటికీ దర్శకుడు దీన్ని తెలుగుకి మలిచిన విధానం ఆకట్టుకునేలా ఉంది. ఓవరాల్ గా పర్ఫెక్ట్ కట్ తో ట్రయిలర్ ఆకట్టుకొని సినిమా మీద అంచనాలు పెంచేసింది.

పెళ్లయిన కుర్రాడు తన భార్యతో విడాకులు తీసుకోవడానికి కోర్టును ఆశ్రయించిన తరుణంలో అతన్ని సరైన దారిలో పెట్టేందుకు భగవంతుడు మానవ రూపంలో వచ్చి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చే కాన్సెప్ట్ తో ఒమై కడవులే కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు దర్శకుడు. పీవీపీ సినిమాస్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బేనర్స్ పై పరల్ వీ పొట్లూరి, పరం వీ పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ కాక ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అక్టోబర్ 21న దీపావళి కానుకగా సినిమా థియేటర్స్ లోకి రానుంది.