Only 2 films for Sankranti 2022 BoxOffice

Thursday,October 07,2021 - 07:39 by Z_CLU

RRR, Radheshyam Sankranti 2022 release

టాలీవుడ్ కి సంక్రాంతి సీజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సీజన్ లో విడుదలయ్యే పెద్ద సినిమాలు భారీ వసూళ్ళు రాబడుతుంటాయి. అందుకే ఈ సీజన్ లో మూడు , నాలుగు బడా సినిమాలు పోటీ పడతాయి. సంక్రాంతి సీజన్ లో రోజుల గ్యాప్ లో నాలుగు సినిమాలు పడాల్సిందే. కానీ ఈసారి సంక్రాంతి కి కేవలం రెండు సినిమాలు మాత్రమే థియేటర్స్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అవును వచ్చే పొంగల్ బరిలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ 'RRR' నిలిచింది. సంక్రాంతి కానుకగా జనవరి 7 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా కంటే ముందు ప్రభాస్ 'రాథేశ్యామ్' ఎనౌన్స్ చేశారు. 'RADHESHYAM జనవరి 14న పండుగ రోజు థియేటర్స్ లోకి వస్తుంది.

అయితే అందరి కంటే ముందు మహేష్ 'సర్కారు వారి పాట' సంక్రాంతి కానుకగా రిలీజ్ అంటూ ప్రకటించారు మేకర్స్. తర్వాత పవన్ కళ్యాణ్, రానా 'భీమ్లా నాయక్' సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. కానీ ఇప్పుడు ఆ రెండు సినిమాలు వాయిదా పడ్డాయని సమాచారం. అందుకే మళ్ళీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వకుండా సైలెన్స్ మేంటైన్ చేస్తున్నారని తెలుస్తుంది.

నిజానికి సంక్రాంతి సీజన్ లో ఎప్పుడూ 3-4 బడా సినిమాలకు స్పేస్ ఉంటుంది. నిర్మాతలు ఒకరికొకరు మాట్లాడుకొని డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటారు. కానీ ఈసారి ఇటు 'RRR' అటు 'రాథే శ్యామ్' సినిమాలకు మిగతా సినిమాలు సైడ్ ఇచ్చేసి నిర్మాతల రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాజమౌళి, దానయ్య మిగతా నిర్మాతలతో చర్చలు జరిపారని టాక్.

ఏదేమైనా వచ్చే సంక్రాంతి ఈ రెండే సినిమాలు అయితే మాత్రం వీటికి భారీ థియేటర్స్ దొరకడం , వాటిలో మంచి వసూళ్ళు రాబట్టడం ఖాయమని ట్రేడ్ పండితులు అభిప్రాయ పడుతున్నారు. చూడాలి మరి ఈ రెండు సినిమాలకు పోటీగా సడెన్ గా మరో సినిమా ఏమైనా వస్తుందా? లేదా వీటితోనే థియేటర్స్ కిక్కిరిసిపోతాయా ?

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics