Official : Ram Charan next with Shankar !

Friday,February 12,2021 - 06:13 by Z_CLU

ప్రస్తుతం 'RRR' తో పాటు 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ S.శంకర్ తో #RC15 సినిమా చేయబోతున్నాడు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించనున్న ఈ కాంబో సినిమాను తాజాగా ఎనౌన్స్ చేశారు. ఇది దిల్ రాజు తన బ్యానర్ లో చేస్తున్న 50వ సినిమా. అందుకే ఎవరూ ఊహించని ఈ కాంబోను తన ల్యాండ్ మార్క్ సినిమా కోసం సెట్ చేసుకున్నాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ రెండు సినిమాలతో బిజీగా ఉండగా శంకర్, కమల్ హాసన్ తో 'ఇండియా2' తీస్తున్నాడు. వీరిద్దరూ కమిట్ అయిన సినిమాలు ఫినిష్ చేసి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తారు.  ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నటించే నటీ నటులు  టెక్నీషియన్స్ ఎవరనేది త్వరలోనే ఫైనల్ చేసి తెలియజేయనున్నారు.

ప్రస్తుతం ఈ కాంబో సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. మరి శంకర్ , చరణ్ తో ఎలాంటి నేపథ్యంతో సినిమా చేస్తాడు ? మెగా పవర్ స్టార్ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడు ? అనేది వేచి చూడాలి.