Official : Boyapati Srinu to direct Ram Pothineni’s #RAP020

Saturday,February 19,2022 - 04:57 by Z_CLU

కొన్ని నెలలుగా చక్కర్లు కొడుతున్న బోయపాటి శ్రీను , రామ్ కాంబో సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. అఖండ తర్వాత బోయపాటి శ్రీను ఏ హీరో ని డైరెక్ట్ చేస్తాడా ? అనే సందేహం అందరిలోనూ ఉంది. ఆ మధ్య అల్లు అర్జున్ తో బోయపాటి శ్రీను నెక్స్ట్ సినిమా ఉండనుందనే టాక్ కూడా వినిపించింది. కొన్ని రోజులుగా రామ్ తో బోయపాటి  ఫిక్స్ అని లీక్ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను ఎనౌన్స్ చేసి ఆడియన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు.

అఖండ విజయం తర్వాత బోయపాటి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇస్మార్ట్ శంకర్ తో రామ్ ని కంప్లీట్ మాస్ హీరోగా మార్చి సక్సెస్ అందుకున్నాడు పూరి. ఇప్పుడు బోయపాటి రామ్ ఏ రేంజ్ మాస్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తాడా ? అనే క్యూరియాసిటీ రైజ్ అవుతోంది. నిజానికి ఈ సినిమా ఇటు బోయపాటి కి అటు రామ్ కి ఇద్దరికీ స్పెషల్ అనే చెప్పాలి. ఇది బోయపాటికి పదో సినిమా. రామ్ కి 20వ సినిమా. అందుకే ఈ సినిమాకోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు బోయపాటి.

ఈ కాంబో సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ లాక్ అయింది. ప్రస్తుతం బోయపాటి స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బేనర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. ప్రెజెంట్ రామ్ లింగుస్వామి దర్శకత్వంలో 'ది వారియర్' అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఉంది. వారియర్ కంప్లీట్ అవ్వగానే బోయపాటితో సినిమా మొదలు పెడతాడు రామ్. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే తెలియనున్నాయి.