O Chinna Family Story World Television Premeire on Sep 15th Zee Cinemalu
Thursday,September 14,2023 - 02:58 by Z_CLU
తెలుగు సిరీస్ లతో నిత్యం ఎంటర్టైన్ చేసే Zee5 లో వచ్చిన బ్లాక్ బస్టర్ సిరీస్ లలో 'ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీ' ఒకటి. ఫ్యామిలీ ఎమోషన్స్ , ఫన్ , లవ్ అన్ని ఎలిమెంట్స్ తో కూడిన ఈ మిడిల్ క్లాస్ డ్రామా ఓటీటీ ఆడియన్స్ ను విపరీతంగా ఎంటర్టైన్ చేసి రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ సిరీస్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ సినిమా చానెల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
జీ సినిమాలు చానెల్ లో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఈ సిరీస్ పూర్తి సినిమాగా వరల్డ్ టెలివిజన్ గా టెలికాస్ట్ గా అవ్వబోతుంది. ఇప్పటి వరకూ ఏ చానెల్ లో చూడని విధంగా ఓ సిరీస్ ను సినిమాగా ప్రసారం చేస్తూ కొత్తధనానికి ఎప్పటి లానే నాంది పలికింది జీ సినిమాలు. సంగీత్ శోభన్ , సిమ్రన్ శర్మ , తులసి , వీకే నరేష్ మెయిన్ లీడ్ కనిపించే ఈ సినిమాలో ఇంకా చాలా మంది ఎంటర్టైన్ చేశారు.
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై నీహారిక కొణిదెల నిర్మించిన ఈ ఫన్ ఎమోషనల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాను మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది.
Miss Avvakunda Chudandi !