NTR31 Shoot starts from December in this ?

Monday,February 13,2023 - 01:09 by Z_CLU

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. NTR30 గా రాబోతున్న ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో మరో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు తారక్. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా ఎనౌన్స్ చేసేశారు. ప్రస్తుతం సలార్ తో పాటే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చేస్తున్నాడట ప్రశాంత్ .

ఈ కాంబో సినిమా ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తుంది. డిసెంబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టే  ప్లానింగ్ రెడీ అవుతుందట. కేజీఫ్ ఫ్రాంచైజ్ తో ప్రశాంత్ పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ తో హాలీవుడ్ కి రీచ్ అయ్యాడు. మరి ఈ క్రేజీ కాంబోలో  సినిమా అంటే ఎక్స్ పెక్టేషన్స్ హ్యూజ్ లో ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా ? అంటూ తారక్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

కొరటాల శివ తో చేస్తున్న సినిమాను డిసెంబర్ లోపే ఫినిష్ చేసి ప్రశాంత్ తో సినిమాను వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లాలని తారక్ భావిస్తున్నాడట . ఈ కాంబో సినిమా గురించి మరిన్ని డీటైల్స్ త్వరలోనే తెలియనున్నాయి.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics