‘NTR30’ Prelook Motion Poster released

Thursday,May 19,2022 - 07:55 by Z_CLU

ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా #NTR30 ప్రీ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా  కొరటాల శివ డైరెక్షన్ లో పవర్ పాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ లుక్ మోషన్ పోస్టర్ సినిమాపై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ ని అమాంతంగా పెంచేసింది. పాన్ ఇండియా మూవీ గా రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు. చేతిలో కత్తులు పట్టుకొని సముద్రంలో వెనుతిరిగి నిల్చున్న తారక్ స్టిల్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

"అప్పుడప్పుడు దైర్యానికి కూడా తెలియదు... అవసరానికి మించి దమ్ముండకూడదని అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని వస్తున్నా" అంటూ మోషన్ పోస్టర్ లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో హింట్ ఇచ్చాడు కొరటాల. మోషన్ పోస్టర్ లో ఎన్టీఆర్ వాయిస్ , అనిరుద్ మ్యూజిక్ , సముద్రం విజువల్స్ ఎట్రాక్ట్ చేశాయి.

 ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో , యువ సుధా ఆర్ట్స్ బేనర్స్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు కెమెరామెన్ గా పనిచేయబోతున్నాడు. ప్రొడక్షన్ డిజైనింగ్ గా సాబు సిరిల్ , ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ ను ఎనౌన్స్ చేశారు మేకర్స్. ఇక మిగతా డీటెయిల్స్ త్వరలోనే చెప్పనున్నారు.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics