NTR-Trivikram Movie to go on sets soon

Saturday,January 02,2021 - 01:13 by Z_CLU

NTR-Trivikram కాంబినేషన్ లో NTR30 సినిమా ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే RRR షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ఈ లోపు త్రివిక్రమ్ మరో హీరోతో సినిమా చేస్తాడనే ప్రచారం జరిగింది. తాజాగా ఆ విషయంపై తారక్ -త్రివిక్రమ్ కలిసిన న్యూ ఇయర్ ఫోటో షేర్ చేస్తూ ప్రాజెక్ట్ లోడింగ్ అంటూ క్లారిటీ ఇచ్చారు హారికా హాసినీ నిర్మాతలు. త్వరలోనే ఈ క్రేజీ కాంబో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని హింట్ ఇచ్చారు.

దీంతో ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మరో సినిమా చేయనున్నాడనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం తారక్ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన త్రివిక్రమ్ హీరోయిన్స్ తో పాటు మిగతా క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల నుండే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

హారికా హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు. మరోవైపు త్రివిక్రమ్, పవన్ తో చేయబోయే అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు స్క్రిప్ట్ సహకారం మాత్రం అందిస్తున్నాడు.

Also Check - ఎన్టీఆర్ సినిమా టైటిల్ అదేనా?