NTR to team-up with Uppena director soon?

Wednesday,April 07,2021 - 01:05 by Z_CLU

'ఉప్పెన' తో దర్శకుడిగా బుచ్చిబాబు ఎంతటి సంచలన విజయం అందుకున్నాడో అందరికీ తెలిసిందే. మొదటి సినిమాతోనే 100 కోట్ల(గ్రాస్) క్లబ్ లో చేరిన బుచ్చిబాబు నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు అనేది ఇప్పుడు హాట్ గా మారింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇటివలే తారక్ ని కలిసి కొన్ని సన్నివేశాలతో నెరేషన్ ఇచ్చాడట.

బుచ్చిబాబు తో సినిమా చేసేందుకు తారక్ కూడా ఆసక్తిగానే ఉన్నాడట. ప్రస్తుతం వీరిద్దరి మధ్య రెండు సిట్టింగ్స్ జరిగాయి. ఫైనల్ నెరేషన్ బ్యాలెన్స్ ఉంది. లాస్ట్ సిట్టింగ్ లో ఈ యంగ్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని ఇంప్రెస్ చేస్తే కనుక ఈ కాంబోలో NTR31 సినిమా ఫిక్సయినట్టే. ప్రస్తుతం ఓ హోటల్ లో స్టే చేస్తూ ఫైనల్ నెరేషన్ కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు బుచ్చిబాబు. తారక్ నుండి కబురు వచ్చే లోపు వర్క్ ఫినిష్ చేసే సన్నాహాల్లో ఉన్నాడు.

హీరో ఎవరైనా బుచ్చిబాబు రెండో సినిమా మాత్రం మైత్రి మూవీ మేకర్స్ లోనే ఉంటుంది. ఉప్పెన రిలీజ్ అవ్వకముందే బుచ్చిబాబు కి రెండో సినిమా కోసం అడ్వాన్స్ అందించారు మేకర్స్. మెగా యంగ్ హీరో లాంచ్ కి ఓ మంచి లవ్ స్టోరీ రాసుకున్న బుచ్చిబాబు ఈసారి తారక్ కోసం ఎలాంటి కథ సిద్దం చేస్తున్నాడనేది అందరిలో ఆసక్తి నెలకొల్పుతుంది.

Also Read 'రిపబ్లిక్' టీజర్ రివ్యూ

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics