NTR to romance with Rashmika Mandanna in NTR30 ?

Saturday,April 30,2022 - 01:46 by Z_CLU

కొరటాల శివ డైరెక్షన్ లో తన ముప్పై సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఈ కాంబో సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ అయింది. 'ఆచార్య' రిలీజ్ కోసమే ఈ ప్రాజెక్ట్ డిలే అయింది. లేదంటే ఈ పాటికి లాంచ్ అయిపోయేది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి హీరోయిన్ గా రష్మిక మందన్న ని ఫిక్స్ చేశారట మేకర్స్. అఫీషియల్ గా మేకర్స్ చెప్పలేదు కానీ రష్మిక ఫిక్స్ అని ఇన్సైడ్ టాక్.

ఇక రష్మిక కూడా పుష్ప 2 తర్వాత ఇంకో పెద్ద సినిమా చేస్తున్నాని చెప్పుకుంది. మేకర్స్ అనౌన్స్ మెంట్ వరకూ తను ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పలేనంటూ చెప్పకనే చెప్పేసింది. త్వరలోనే  పుష్ప , ఎన్టీఆర్30 రెండు సినిమాల  షూటింగ్ లో పాల్గొననుండి రష్మిక. ఇక సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉండనుందని తెలుస్తుంది. ఆ రోల్ కి ఎవరైనా యంగ్ హీరోయిన్ ని ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట.

యువసుధ ఆర్ట్స్ బేనర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ ఇవ్వనున్నాడని టాక్ వినబడుతుంది. ఈ విషయాన్ని కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఇక మే20 ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఓ అప్ డేట్ కూడా రానుంది. ఆ రోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే చాన్స్ ఉంది.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics