NTR Teaser from RRR to release on October 22

Tuesday,October 06,2020 - 12:21 by Z_CLU

దాదాపు 7 నెలల లాంగ్ గ్యాప్ తర్వాత RRR Movie నిన్నట్నుంటి సెట్స్ పైకి వచ్చింది. ఇవాళ్టి నుంచి Ramcharan, NTR కూడా సెట్స్ పైకి వచ్చారు. ఈ విషయాన్ని చెబుతూ.. యూనిట్ ఓ మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా #WeRRRBack అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.

https://www.youtube.com/watch?v=SYNYd9RtTLw

సెట్స్ పైకి ఇలా రావడం.. ఆ వెంటనే మేకింగ్ వీడియో రిలీజ్ చేయడం.. ఆ వెంటనే తారక్-చరణ్ కూడా సెట్స్ పైకి రావడం.. ఇలా అన్నీ బ్యాక్ టు బ్యాక్ జరగడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్ ను డబుల్ చేస్తూ ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు మేకర్స్.

అవును.. ఈనెల 22న RRR మూవీ నుంచి ఎన్టీఆర్ టీజర్ (#RamarajuForBheem) రాబోతోంది. సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరంభీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు.