NTR Speech at Brahmastra PreRelease Event

Saturday,September 03,2022 - 05:25 by Z_CLU

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌భీర్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్రం’ మొద‌టి భాగం శివ‌.  అలియా భ‌ట్ హీరోయిన్‌. స్టార్ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌, స్టార్ లైట్ పిక్చ‌ర్స్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న ఈ భారీ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 9న గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘ముందుగా నా అభిమానులకు క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేస్తున్నాం. ఎంతో ఆర్భాటంగా వేడుక చేయాల‌నుకున్నాం. కానీ పోలీసులు భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌లేమ‌ని అన్నారు. వాళ్లు మ‌న సేఫ్టీ కోసమే చెప్పారు. వారి మాట‌ల‌ను వినాల్సిన బాధ్య‌త పౌరులుగా మ‌న‌కుంది. అందుక‌నే ఈవెంట్‌ను చేయాల్సిన చేయలేక‌పోతున్నాం. ఇక్క‌డ‌కు రావాల‌నుకున్న అభిమానులు రాలేక‌పోయినందుకు వారికి క్ష‌మాప‌ణ‌లు చెప్పుకుంటున్నాం. వారు ఈవెంట్‌కి రాలేక‌పోయిన‌ప్ప‌టికీ మంచి సినిమాల‌ను ఆశీర్వ‌దిస్తార‌ని న‌మ్ముతున్నాం.