NTR Koratala Movie official Announcement

Monday,April 12,2021 - 08:51 by Z_CLU

నిన్నటివరకు NTR30 సినిమా చుట్టూ ఉన్న ప్రశ్నలకు ఎట్టకేలకు సమాధానం లభించింది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఎన్టీఆర్ 30వ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయాలి. కొన్ని రోజుల క్రితం ఎనౌన్స్ అయిన ఈ కాంబో షూట్ దగ్గరి వరకూ వచ్చి క్యాన్సల్ అయ్యింది. ఫైనల్ గా ఇప్పుడు తన లాండ్ మార్క్ మూవీని కొరటాల శివ చేతిలో పెట్టాడు తారక్. బ్లాక్ బస్టర్ కాంబో ఈజ్ బ్యాక్ అంటూ #NTRKoratala2 సినిమాను ఎనౌన్స్ చేశారు మేకర్స్. ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ పై కళ్యాణ్ రామ్ సమర్పణలో, యువసుధ ఆర్ట్స్ సంస్థపై మిక్కిలినేని నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29 న విడుదల అంటూ ఎనౌన్స్ మెంట్ తో పాటే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.

గతంలో ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్'సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన సంగతి తెలిసిందే. మంచి సందేశాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో చెప్పి ఆ సినిమాతో అందరినీ మెప్పించిన ఈ కాంబో ఈసారి ఎలాంటి కథతో రాబోతున్నారనే క్యూరియాసిటీ అభిమానుల్లో మొదలైంది. అయితే "ఈసారి రిపేర్లు నేషనల్ లెవెల్ లో జరపబడును" అంటూ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు మేకర్స్.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తారక్ 'RRR' షూట్ పూర్తి చేసేలోపు చిరుతో కొరటాల శివ తీస్తున్న 'ఆచార్య' థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. ఈ ఇద్దరు ఫ్రీ అవ్వగానే సినిమా పట్టాలెక్కనుంది. ఈ లోపు కొన్ని మీటింగ్స్ పెట్టుకొని కాస్ట్ అండ్ క్రూ ని ఫైనల్ చేసుకుంటాడు కొరటాల.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics