No third hero in F3 Movie

Thursday,January 28,2021 - 08:41 by Z_CLU

F3 Movie ఆల్రెడీ సెట్స్ పైకి వచ్చేసింది. రెగ్యులర్ షూటింగ్ నడుస్తోంది. అయినప్పటికీ ఈ సినిమాపై నడుస్తున్న ఓ పుకారు మాత్రం అలానే కంటిన్యూ అవుతోంది. ఎట్టకేలకు ఆ రూమర్ పై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు అనీల్ రావిపూడి.

ఎఫ్3 మూవీలో ముగ్గురు హీరోలు ఉన్నారనేది ఆ పుకారు. మూవీ లాంఛింగ్ కు ముందు నుంచే నడుస్తున్న ఈ రూమర్ ను కొట్టిపారేశాడు దర్శకుడు. ఎఫ్2లో ఉన్నట్టే F3లో కూడా వరుణ్ తేజ్వెంకటేష్ మాత్రమే హీరోలుగా ఉంటారని చెబుతున్నాడు.

F3లో రవితేజ లేదా సాయితేజ్ ను మూడో హీరోగా తీసుకునే అవకాశం ఉందని చాన్నాళ్లుగా ఓ గాసిప్ నడుస్తోంది. తాజాగా అనీలా రావిపూడి ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఈ గాసిప్ తేలిపోయింది.

దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ లో ఈసారి మనీ మేటర్స్ డిస్కస్ చేశారు. వరుణ్-మెహ్రీన్, వెంకీ-తమన్న జంటల మధ్య డబ్బు ఎలా చిచ్చుపెట్టిందనే ఎలిమెంట్ ను ఫన్నీగా చూపించబోతున్నారు.