Nithin’s A..Aa Movie Completes 5 Years today

Wednesday,June 02,2021 - 12:44 by Z_CLU

అ..ఆ.. సినిమా టైటిల్ మాత్రమే కాదు, సినిమా కూడా ఎంతో ప్రత్యేకం. ఇప్పటివరకు నితిన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ ఈ సినిమా. అలా అని కేవలం దీన్నొక సూపర్ హిట్ సినిమాగా మాత్రమే చూడ్డానికి వీల్లేదు. ఇందులో ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

ఎన్నో ఏళ్ల తర్వాత తెలుగుప్రేక్షకులకు తెలుగుదనాన్ని, పచ్చదనాన్ని మరోసారి పరిచయం చేసింది ఈ సినిమా. మరెన్నో ఇలాంటి కుటుంబకథా చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమను ఒక అందమైన దృశ్యకావ్యంగా మలిచాడు.

[caption id="attachment_190339" align="alignnone" width="640"]A-Aa-Movie-5-years-zeecinemalu అ..ఆ మూవీకి ఐదేళ్లు[/caption]

2016లో విడుదలైన ఈ సినిమా ఇవాళ్టితో సరిగ్గా 5 ఏళ్లు పూర్తిచేసుకుంది. అయినప్పటికీ ఇప్పటికీ అనసూయ రామలింగం, ఆనంద్ విహారి పాత్రలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

సినిమాకు మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం సూపర్ హిట్టయింది. ఇప్పటికీ ఈ సినిమా పాటల్ని వినేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అనసూయ రామలింగం పాత్ పోషించిన సమంత.. తన కెరీర్ లోనే మోస్ట్ మెమొరబుల్ సినిమాగా అ..ఆను చెబుతుంటుంది.

అటు నితిన్ కూడా ఆనంద్ విహారి పాత్రలో ఒదిగిపోయాడు. అప్పటివరకు మాస్, యాక్షన్, లవ్ సినిమాలు చేసిన ఈ హీరో.. సున్నితమైన భావోద్వేగాలు, కుటుంబ బాంధవ్యాలతో ఉన్న ఈ సినిమాలో కొత్తగా కనిపించాడు. ఇక మూవీలో రావు రమేష్, అజయ్, అవసరాల శ్రీనివాస్, నదియా పాత్రలు కూడా ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. ప్రస్తుతం బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న హరితేజకు ఈ సినిమానే టర్నింగ్ పాయింట్.

[caption id="attachment_190340" align="alignnone" width="640"]A-Aa-Movie-5-years-zeecinemalu అ..ఆ మూవీకి ఐదేళ్లు[/caption]

ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. త్రివిక్రమ్. ఈ దర్శక దిగ్గజం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమాతో మరోసారి తన పెన్ పవర్ చూపించాడు గురూజీ. మూవీలో అడుగడుగునా మాటల మాంత్రికుడి కొటేషన్లను ఏరుకోవచ్చు. అంతలా తన పంచ్ లతో, సింపుల్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు త్రివిక్రమ్. ఇప్పటికీ టీవీల్లో ఫ్యామిలీ ఆడియన్స్ హాట్ ఫేవరెట్ ఈ సినిమా.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics