Nithin gifts costly car to Bheeshma Director Venky Kudumula

Wednesday,September 09,2020 - 12:38 by Z_CLU

ఇండస్ట్రీలో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం కామన్. మొన్నటికిమొన్న తన పర్సనల్ ఫిట్ నెస్ ట్రయిలర్ కు రేంజ్ రోవర్ కారు ఇచ్చాడు హీరో ప్రభాస్. ఇప్పుడు వెంకీ కుడుమల కూడా అదే బ్రాండ్ కారు అందుకున్నాడు.

హీరో Nithin కూడా డైరెక్టర్ Venky Kudumula కి Range Rover బహుమతిగా ఇచ్చాడు. వరుస అపజయాలతో సతమవుతున్న సమయంలో నితిన్ కి Bheeshma అనే సాలిడ్ హిట్ ఇచ్చాడు వెంకీ. అందుకే ఇప్పుడు వెంకీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు నితిన్.

నిన్న దర్శకుడు వెంకీ కుడుముల బర్త్ డే. ఆ సందర్భంగా ఈ కారు ఇచ్చాడు నితిన్. ఊహించని ఓ రేంజ్ గిఫ్ట్ హీరో నుండి బర్త్ డే గిఫ్ట్ గా అందుకునే సరికి వెంకీ ఆనందానికి హద్దుల్లేవు. తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకొని నితిన్ ఇచ్చిన కారుతో ఓ ఫోటో తీసుకొని అభిమానులతో పంచుకున్నాడు.