Nithiin makes a major reveal about Zee5’s BlockBuster Thriller Pulimeka

Saturday,March 25,2023 - 06:24 by Z_CLU

https://twitter.com/actor_nithiin/status/1639243703914217473/video/1

ఫిబ్ర‌వ‌రి 23 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ ఛానెల్ జీ 5లో స్ట్రీమింగ్ అవుతోన్న 8 ఎపిసోడ్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘పులి మేక’. దీన్ని జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ కాంబినేష‌న్‌లో ఈ ఒరిజిన‌ల్ రూపొందింది.

ఇటు ప్రేక్ష‌కులు, అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన ఈ సిరీస్‌లో అస‌లు మెగా ట్విస్ట్ ఏంటంటే సిటీలో పోలీసుల‌ను వ‌రుస‌గా హ‌త్య‌లు చేసే కిల్ల‌ర్ ఎవ‌రో కాదు.. ఐపీఎస్ ఆఫీస‌ర్ అయిన కిర‌ణ్ ప్ర‌భ. ఈ విష‌యం తెలిసిన త‌ర్వాత ఆడియెన్స్‌లో తెలియ‌ని ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. అందుకు కార‌ణం ఆ పాత్ర‌లో న‌టించిన లావ‌ణ్య త్రిపాఠినే ఆ సిరీస్ ప్ర‌ధాన పాత్ర‌ధారి కావ‌టం. స‌మాజంలో అమ్మాయిల‌కు జ‌రుగుతున్న స‌మ‌స్య‌ల‌పై ఆమె పోరాటం చేస్తుంటుంది. సాధార‌ణంగా ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్స్‌లో కిల్ల‌ర్ ఎవ‌ర‌నే విష‌యాన్ని గోప్యంగా ఉంచుతారు. ప్రేక్ష‌కులు కూడా అలా చూడ‌టానికే ఇష్ట‌ప‌డ‌తారు. అయితే అలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్‌ను రివీల్ చేయ‌టానికి యాక్ట‌ర్ నితిన్ స‌పోర్ట్ తీసుకున్నారు మేకర్స్. అందుకు కార‌ణం రైట‌ర్‌, షో ర‌న్న‌ర్ కోన వెంక‌ట్‌కు మాత్ర‌మే అస‌లు కిల్ల‌ర్ ఎవ‌రు.. స‌స్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌లో ఇంకా ఊహించ‌ని ట్విస్టులున్నాయని తెలుసు.

‘‘ఇప్పుడే సిరీస్ చూశాను. ఇంత పెద్ద ట్విస్ట్ను రివీల్ చేయ‌టం ఓ స్పాయిల‌ర్ అల‌ర్ట్ అనే చెప్పాలి. ఎంటైర్ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా రూపొందిన ఇన్వెస్టిగేటివ్ ఫ్యామిలీ థ్రిల్లర్‌లో ఇంత పెద్ద ట్విస్ట్‌ను ఎవ‌రూ అస‌లు ఊహించ‌రు’’ అని తన సోషల్ మీడియాలోపోస్ట్ చేశారు హీరో  నితిన్. ప్రస్తుతం అన్నీ తెలుగు వెబ్ సిరీస్‌ల‌న్నింటిలోనూ వ్యూయింగ్ మినిట్స్ ప‌రంగా పులి మేక సిరీస్ సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది.

సాధార‌ణంగా ఎంటైర్ ప్లాట్‌కు మెయిన్ అయిన ట్విస్ట్‌ను రివీల్ చేయాల‌నుకోవ‌టం అసాధార‌ణం. అలాగే నితిన్ షేర్ చేసిన వీడియోలో ఆది సాయి కుమార్ క్యారెక్ట‌ర్‌..ఐపీఎస్ ఆఫీస‌ర్ కిర‌ణ్ ప్ర‌భ అస‌లు ముసుగుని తొలగించి ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఆమె నిజ స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెడుతున్నాడు. ఓ వైపు హ‌త్య‌లు చేస్తూనే ఇన్వెస్టిగేట్ చేస్తున్న వ్య‌క్తిని ప్ర‌శ్నించిన‌ప్పుడు త‌ను ప‌డే ఆందోళ‌న‌, ఉద్వేగం స్ప‌ష్టంగా వీడియోలో క‌నిపిస్తుంది.ఈ ఆస‌క్తిని రేపే అస‌లు పాయింట్‌ను బ‌య‌ట‌కు చెప్పిన‌ప్పుడు ప్రేక్ష‌కుల‌కు స‌మాధానాల‌కంటే ప్ర‌శ్న‌లే ఎక్కువ‌గా వ‌స్తాయి. నిజానికి ఇలా ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకోవ‌టం అనేది స్మార్ట్ థ్రిల్ల‌ర్‌కు ఉండే ప్ర‌ధాన ల‌క్ష‌ణం. దీంతో ఇప్పుడు ప్రేక్ష‌కుల్లో హ‌త్య‌ల‌ను ఎవ‌రు చేశార‌నే దాని కంటే ఎందుకు చేశారు ఎలా చేశారు? అనే దానిపై ఆస‌క్తి మ‌రింత పెరుగుతుంద‌న‌టంలో సందేహం లేదు.

లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన పులి మేక‌ సిరీస్‌లో ఆది సాయికుమార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, సిరి హ‌న్మంత్, రాజా చెంబోలు, నోయ‌ల్ సేన్ త‌దిత‌ర‌లుఉ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో అల‌రించారు. ఈ ఒరిజిన‌ల్ రీసౌండింగ్ స‌క్సెస్ అనేది క‌థ‌లోని ట్విస్టులు, హృద‌యానికి హ‌త్తుకునే మెసేజ్‌ల‌ను ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తార‌న‌టానికి రుజువు. సామాజిక సందేశాల‌ను మ‌హిళ‌లు ఇష్ట‌ప‌డ‌తార‌న‌టానికి కూడా ఇదొక ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు.

న‌టీన‌టులు:  కిర‌ణ్ ప్ర‌భ‌గా లావ‌ణ్య త్రిపాఠి, ప్ర‌భాక‌ర్ శ‌ర్మ‌గా ఆది సాయి కుమార్, అనురాగ్ నారాయ‌ణ్‌గా సుమన్‌, దివాక‌ర్ శ‌ర్మ‌గా గోప‌రాజు,  క‌రుణాక‌ర్ శ‌ర్మగా రాజా,  ప‌ల్ల‌విగా సిరి హన్మంత్, ఆది సాయికుమార్ అసిస్టెంట్ వెంకట్ పాత్రలో ముక్కు అవినాష్, పాండు రంగారావుగా శ్రీనివాస్, శ్వేతగా స్పందన పల్లి న‌టించారు.