Nithiin and Vakkantham’s film titled ‘Junior’ ?

Thursday,March 03,2022 - 12:04 by Z_CLU

ప్రస్తుతం ఎడిటర్ శేఖర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'మాచర్ల నియోజిక వర్గం'  సినిమా చేస్తున్నాడు నితిన్. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి సగం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు నితిన్. అవును నెక్స్ట్ వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు నితిన్.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుందని సమాచారం. అయితే ఈ సినిమాకు తాజాగా టైటిల్ ఫిక్స్ చేశారని టాక్ వినబడుతుంది. 'జూనియర్' అనే టైటిల్ తో ఈ సినిమా రానుందని తెలుస్తుంది. ఇంకా అఫీషియల్ గా మేకర్స్ చెప్పలేదు కానీ ఈ టైటిలే సినిమాకు ఫిక్స్ అని వినబడుతుంది.

ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన వక్కంతం వంశీ అర్జున్ హీరోగా 'నా పేరు సూర్య'  సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ నితిన్ సినిమాతో మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ప్రస్తుతం అఖిల్ -సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న 'ఏజెంట్' సినిమాకు కథ -మాటలు అందిస్తున్నాడు వక్కంతం. త్వరలోనే నితిన్ -వక్కంతం సినిమా గ్రాండ్ గా ప్రారంభం కానుందని తెలుస్తుంది. ఏప్రిల్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే అవకాశం ఉంది. బేనర్ వివరాలు మిగతా కాస్టింగ్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.

 
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics