Nithiin-AllariNaresh coming with different roles !

Thursday,February 18,2021 - 12:43 by Z_CLU

ప్రస్తుతం యంగ్ హీరోలందరూ కొత్త క్యారెక్టర్స్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ లిస్టులో నితిన్ , నరేష్ ముందున్నారు. అవును కెరీర్ లో ఇప్పటి వరకు చేయని ఖైదీ పాత్రలు చేస్తూ క్రైం థ్రిల్లర్ జోనర్ సినిమాలతో  థియేటర్స్ లో ఎంట్రీ ఇస్తున్నారు ఇద్దరు.

ఇప్పటి వరకు లవర్ బాయ్ రోల్స్ తో మెప్పించిన నితిన్ ఉన్నపళంగా ఖైదీ అవతారమెత్తాడు. చంద్ర శేఖర్ ఏలేటి డైరెక్షన్ లో చేస్తున్న 'చెక్' లో ఆడియన్స్ ఊహించని క్యారెక్టర్ ప్లే చేశాడు. సినిమాలో జైలు ఎపిసోడ్ అంతా నితిన్ ఖైదీగానే కనిపిస్తూ చెక్ ప్లేయర్ గా ఆకట్టుకోనున్నాడు.

ఇక ఇప్పటి వరకు కామెడీ రోల్స్ , సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన అల్లరి నరేష్ 'నాంది' తో తన నూతన ప్రయాణానికి నాంది పలకబోతున్నాడు. తొలి సారిగా అండర్ ట్రయల్ ఖైదీ గా కనిపిస్తూ ఆడియన్స్ కి కొత్త ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్నాడు. సినిమాలో తప్పు చేయని అండర్ ట్రయల్ ఖైదీగా కనిపించడం కోసం ఎంతో కష్టపడ్డాడు నరేష్.

ఇలా ఒకే నెలలో ప్రేక్షకుల ముందుకు ఇద్దరు హీరోలు ఖైదీలుగా రాబోతున్నారు. మరి వీరిలో ప్రేక్షకుల మెప్పు పొంది వారి మనసుల్ని దోచే ఖైదీ ఎవరో చూడాలి.