Ninnila Ninnila – February 26 release

Monday,February 22,2021 - 12:14 by Z_CLU

అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం `నిన్నిలా నిన్నిలా`. బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్‌ల‌‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. అని.ఐ.వి.శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

జీ ప్లెక్స్‌లో ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా ఫిబ్ర‌వ‌రి 26న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది.

చిత్ర ద‌ర్శ‌కుడు అని.ఐ.వి.శ‌శి మాట్లాడుతూ - ``స్నేహితులం అంద‌రూ క‌లిసి చేసిన సినిమా ఇదిఅంద‌రూ నిజాయ‌తీతో సినిమా చేశాం. . అంద‌రం లండ‌న్ వెళ్లి ఫ‌న్‌ను ఎంజాయ్ చేస్తూ సినిమాను పూర్తి చేశాం. సినిమా బాగా వ‌చ్చింది. సినిమా చూస్తున్నంత సేపు చిరున‌వ్వుతో ఉంటారు`` అన్నారు.

హీరోయిన్ రీతూవ‌ర్మ మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడు అనిగారికి, నిర్మాత‌లు ప్ర‌సాద్‌గారికి, బాపినీడు గారికి థాంక్స్‌. నాజర్‌గారు, నిత్యామీన‌న్‌, అశోక్ సెల్వ‌న్‌తో క‌లిసి యాక్ట్ చేయ‌డం హ్యాపీగా అనిపించింది`` అన్నారు.

హీరోయిన్ నిత్యామీన‌న్ మాట్లాడుతూ - ``స్నేహితులంద‌రం క‌లిసి ఓ బ్యూటీఫుల్ సినిమా చేశాం. మా అంద‌రికీ ఎంతో న‌చ్చిన సినిమా. ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు అలా మొద‌లైంది గుర్తుకు వ‌స్తుంది. నందినీ, నేను, నాని క్లోజ్‌ఫ్రెండ్స్‌గా చేసిన సినిమా అది. ఆ సినిమా ఎంత బాగా హిట్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాలాగానే `నిన్నిలా నిన్నిలా` సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

హీరో అశోక్ సెల్వ‌న్ మాట్లాడుతూ - ``ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన సినిమాల‌కు భిన్న‌మైన చిత్రం. ఫీల్ ఉండే ల‌వ్ స్టోరితో తెర‌కెక్కింది. ఫ్రెండ్స్‌లా అంద‌రం కలిసి ఎంజాయ్ చేస్తూ చేశాం. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సినిమా కూల్‌గా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపే ఓ స్మైల్ మీ మొహంలో ఉంటుంది. జీ ప్లెక్స్‌లో ఫిబ్ర‌వ‌రి 26న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాను అంద‌రూ చూసి మా ప్ర‌య‌త్నాని ఆశీర్వ‌దించాల‌ని కోరుతున్నాను`` అన్నారు.

న‌టీన‌టులు: అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ, నాజర్‌ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌క‌త్వం: అని.ఐ.వి.శ‌శి నిర్మాత‌: బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌ స‌మ‌ర్ప‌ణ‌: బాపినీడు.బి సినిమాటోగ్ర‌ఫీ: దివాక‌ర్ మ‌ణి సంగీతం: రాజేశ్ మురుగేశ‌న్‌ పాట‌లు: శ్రీమ‌ణి డైలాగ్స్‌: నాగ చంద‌, అనుష‌, జ‌యంత్ పానుగంటి ఆర్ట్‌: శ్రీ నాగేంద్ర తంగాల‌ ఎడిటింగ్‌: న‌వీన్ నూలి డైలాగ్స్‌: నాగ చందు, అనుష, జ‌యంత్ పానుగంటి పి.ఆర్.ఒ: వంశీ కాకా