Nikhil’s Karthikeya 2 Trailer Review

Friday,June 24,2022 - 06:23 by Z_CLU

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ కార్తికేయ 2. కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్ వాయిస్ తో వచ్చిన మోషన్ పోస్టర్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ను అమాంతం పెంచేసింది. ఇప్పుడా అంచనాల్ని మరింత పెంచుతూ వచ్చింది కార్తికేయ-2 ట్రయిలర్.

"అసలు కృష్ణుడేంటి... ఈ కథను ఆయనే నడిపించడం ఏంటి" అంటూ హీరో చెప్పే డైలాగ్స్ తో ట్రయిలర్ ఆసక్తికరంగా మారింది. "విశ్వం ఒక పూసల దండ, ప్రతిది నీకు సంబంధమే, ప్రతిది నీమీద ప్రభావమే" అనే డైలాగ్ తో సినిమా స్టోరీలైన్ ను కొంచెం రివీల్ చేసినట్టయింది. నిమిషానికి పైగా ఉన్న ఈ ట్రయిలర్ సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది.

ట్రయిలర్ లో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ లుక్స్ బాగున్నాయి. అనుపమ్ ఖేర్ తో పాటు కీలకమైన ఆర్టిస్టులందర్నీ ట్రయిలర్ లో చూపించారు. కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కార్తీక్ ఘట్టమనేని ఫ్రేమ్స్.. ట్రయిలర్ కు రిచ్ లుక్ తీసుకొచ్చాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాతలు మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది.

సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఇప్పుడి రిలీజైన ట్రయిలర్ కు ట్రయిలర్-1 అనే పేరు పెట్టారు. అంటే త్వరలోనే మరికొన్ని ట్రయిలర్స్ రాబోతున్నాయని అర్థం. జులై 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. ఈ గ్యాప్ లో మరికొన్ని ట్రయిలర్స్ వచ్చే ఛాన్స్ ఉంది.