Nikhil Siddharth’s ’18Pages’ trailer on 17th December

Thursday,December 15,2022 - 02:15 by Z_CLU

Nikhil Siddharth's '18Pages' trailer on 17th December

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న "జీఏ 2" పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "18 పేజిస్". మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ "18పేజిస్" ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు "కుమారి 21ఎఫ్" చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవలే విడుదలైన "18పేజిస్" టీజర్ కి, "నన్నయ్య రాసిన" అలానే "టైం ఇవ్వు పిల్ల" సాంగ్స్ తో పాటు రీసెంట్ గా రిలీజైన "ఏడు రంగుల వాన" అనే పాట మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ను డిసెంబర్ 17 న  రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

ప్రొమోషన్స్ లో భాగంగా ఒక క్రేజి వీడియోతో ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు అనుపమ , నిఖిల్.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics