తన కెరీర్ లో ప్లాన్-బి లేదంటోంది హీరోయిన్ నిధి అగర్వాల్. హీరోయిన్ అవుదామనే టార్గెట్ తోనే వర్క్ చేశానని, సాధించానని చెప్పుకొచ్చింది. ఓ మూడేళ్లు లేట్ అయినా నటిగానే వచ్చేదాన్ని తప్ప, మరో ప్రొఫెషన్ లోకి వెళ్లే ఉద్దేశం లేదని అంటోంది Nidhhi Agerwal
ఈ లాక్ డౌన్ టైమ్ లో మరోసారి తన అభిమానులతో ఛాట్ చేసింది నిధి. ఈ సందర్భంగా తనలోని టాలెంట్ ను మరోసారి చెప్పుకొచ్చింది.
నిధి అగర్వాల్ కు మాత్రం 2 చేతులతో పనిచేయడం అలవాటు. చిన్నప్పట్నుంచి అలా తనకు అలవాటు అయిపోయిందని చెబుతోంది నిధి. అంతేకాదు.. చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ కుడిచేయి, ఎడమ చేయితో చక్కగా రాయగలనని అంటోంది.
తనకు తెలుగు బాగా వచ్చంటోంది నిధి అగర్వాల్. తన తండ్రిది హైదరాబాద్ అని, గ్రాండ్ పేరెంట్స్ హైదరాబాద్ లోనే ఉన్నారని చెప్పుకొచ్చింది. చిన్నప్పట్నుంచి ప్రతి సమ్మర్ కు హైదరాబాద్ రావడం తనకు అలవాటని చెప్పింది.
మరోవైపు తన రిలేషన్ షిప్ స్టాటస్ పై కూడా స్పందించింది Nidhhi Agerwal. ప్రస్తుతం తను ఎవ్వరితో డేటింగ్ చేయడం లేదని, సింగిల్ గా ఉన్నానని చెప్పుకొచ్చింది. తన మనసులో ఎవ్వరూ లేరంటోంది.
ఇక తనకు సంబంధించి మరికొన్ని వివరాలు చెబుతూ.. తను దేవుడ్ని నమ్ముతానని, తన వాల్ పేపర్ పై దేవుడి బొమ్మ ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇంటర్మీడియ్ లో 87శాతం మార్కులొచ్చాయని, కానీ తనకు చదువు కంటే నటన అంటేనే ఇష్టమని చెబుతోంది.