New Telugu Releases in November month

Tuesday,November 01,2022 - 02:02 by Z_CLU

అక్టోబర్ లో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకుంటే మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి.  నవంబర్ లో కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి నెలలో రాబోయే ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం !

మొదటి వారం 

నవంబర్ 4 న ఆరు సినిమాలు థియేటర్స్ లోకి రానున్నాయి. అల్లు శిరీష్ 'ఊర్వశివో రాక్షసివో' (Urvasivo Rakshasivo) , సంతోష్ శోభన్ 'లైక్ షేర్ సబ్ స్క్రైబ్' (Like share suvbscribe) , నందు 'బొమ్మ బ్లాక్ బస్టర్' తో పాటు శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన 'తగ్గదేలే',   కన్నడ డబ్బింగ్ సినిమా 'బనారస్', తమిళ్ డబ్బింగ్ మూవీ 'ఆకాశం' సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో ఈ వారం ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తున్న సినిమాలు 'ఊర్వశివో రాక్షసివో', 'లైక్ షేర్ సబ్ స్క్రైబ్' మాత్రమే. మరి మిగతా సినిమాలు సైలెంట్ గా వచ్చి హిట్ కొడతాయేమో చూడాలి.

రెండో వారం

నవంబర్ 11న సమంత టైటిల్ రోల్ లో నటించిన 'యశోద' (Yashoda) , అల్లరి నరేష్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' (Itlu Maredumilli Prajaneekam), తిరువీర్ హీరోగా తెరకెక్కిన చిన్న సినిమా 'మసూద' తో పాటు 'బ్లాక్ పాంథర్ ( వాకాండ)' అనే హాలీవుడ్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే  టీజర్, ట్రైలర్ తో 'యశోద' ఆకట్టుకుంటుంది. అలాగే అల్లరి నరేష్ కూడా విభిన్న కథతో చేస్తున్న సినిమా కావడంతో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంపై మంచి అంచనాలు ఉన్నాయి. మసూద కూడా చిన్న సినిమాగా వచ్చి మేజిక్ క్రియేట్ చేసే చాన్స్ కనిపిస్తుంది. ఇక బ్లాక్ పాంథర్ (వాకాండ ఫరెవర్) సిరీస్  పై కూడా మూవీ లవర్స్ లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. 'నచ్చింది గర్ల్ ఫ్రెండ్' అనే చిన్న సినిమా వీటితో పాటు రానుంది.

 

ఇక నవంబర్ చివరి వారంలో శ్రీ సింహా హీరోగా వస్తున్న 'భాగ్ సాలే' , మేఘ ఆకాష్ 'మాటే మంత్రము' ,అనసూయ 'అరి',  'ఎర్రర్ 500', 'శశి వదనే' , తెలిసిన వాళ్ళు' , అనే సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మరి వీటిలో నవంబర్ లో బక్సాఫీస్ దగ్గర విజయం అందుకొని ప్రేక్షకులను అలరించే సినిమాలేంటో వేచి చూడాలి.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics