Nani’s Shyam Singha Roi Launched

Thursday,December 10,2020 - 03:33 by Z_CLU

Nani హీరోగా రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న Shyam Singha Roy పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ ఈవెంట్ లో దర్శకులు అనిల్ రావిపూడి , వెంకీ కుడుముల , మేర్లపాక గాంధి పాల్గొన్నారు. మొదటి షాట్ కి నాని తండ్రి గంటా రాంబాబు క్లాప్ నివ్వగా అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించాడు.

Nani_Shyam_singha_roi_Launch_sai_pallavi_krithi_shetty-zeecinemalu4

సూపర్ నేచురల్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకు సత్యదేవ్ జంగా కథను అందించారు. ఈ నెల 21 నుండి హైదరాబాద్ లో రెగ్యులర్ షూట్ షెడ్యూల్ చేశారు. తర్వాత షెడ్యూల్ కలకత్తా లో ఉంటుంది.

Nani_Shyam_singha_roi_Launch_sai_pallavi_krithi_shetty-zeecinemalu3

నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాహుల్ సంక్రిత్యాన్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు.

Nani_Shyam_singha_roi_Launch_sai_pallavi_krithi_shetty-zeecinemalu2

నిహారిక ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజర్. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో నాని ఇప్పటి వరకు కనిపించని ఓ సరికొత్త పాత్రలో కనిపించి మెప్పిస్తాడని యూనిట్ అంటోంది.