Nani Vivek Athreya Movie Title

Saturday,November 21,2020 - 02:35 by Z_CLU

ఒక యాక్ట‌ర్‌గా ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేస్తున్న‌ప్ప‌టికీ, ప‌క్కింట‌బ్బాయి త‌ర‌హా పాత్ర‌లతో నేచుర‌ల్ స్టార్ Nani ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడీ హీరో Vivek Athreya తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఫ్యామిలీ ఆడియెన్స్‌లో నానికి ఉన్న ఆద‌రాభిమానాల‌కు త‌గ్గ‌ట్లుగా #Nani28 చిత్రానికి 'అంటే..సుంద‌రానికీ!' అనే ఆస‌క్తిక‌ర టైటిల్ ఖ‌రారు చేశారు. ఒరిజిన‌ల్ స్టోరీతో మ్యూజిక‌ల్ రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా రాబోతోంది.

టైటిల్ అనౌన్స్‌మెంట్ సంద‌ర్భంగా చిత్ర బృందం విడుద‌ల చేసిన వీడియో క్రేజీగా ఉంది. టైటిల్ ఎనౌన్స్ మెంట్ వీడియోలో నాని, హర్షవర్థన్ గొంతులు వినిపిస్తున్నాయి.

త్వ‌ర‌లో చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానున్న 'Ante Sundaraniki' సినిమా 2021లో ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత వినోదాన్ని పంచ‌బోతోంది. ఈ సినిమాతో నజ్రియా ఫహాద్ (Nazriya Fahadh) హీరోయిన్ గా పరిచయమౌతోంది.

ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: వివేక్ ఆత్రేయ‌ నిర్మాత‌లు: న‌వీన్ యెర్నేని, ర‌విశంక‌ర్ వై. బ్యాన‌ర్‌: మైత్రి మూవీ మేక‌ర్స్‌ సీఈవో: చెర్రీ మ్యూజిక్‌: వివేక్ సాగ‌ర్‌ సినిమాటోగ్ర‌ఫీ: నికేత్ బొమ్మి ఎడిటింట్‌: ర‌వితేజ గిరిజాల‌ ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: ల‌తా త‌రుణ్‌