Nani is doing an experiment with DASARA Movie

Wednesday,January 26,2022 - 04:04 by Z_CLU

నేచురల్ స్టార్ నాని 'దసరా' అనే డిఫరెంట్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇటివలే 'అంటే సుందరానికి' సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తిచేసిన నాని త్వరలోనే దసరా షూట్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో నాని లుక్ లాక్ అయింది. ఇప్పటి వరకు చూడని కొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు నాని. ప్రీ లుక్ పోస్టర్ తోనే లుక్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. తెలంగాణా నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నాడని సమాచారం.

గతంలో నాని 'జెండాపై కపిరాజు' అనే సినిమాతో పాటు తాజాగా 'V' సినిమాలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించాడు. ఆ రెండు సినిమాలు నానికి ఆశించిన ఫలితం అందివ్వలేకపోయాయి. అందుకే ఈసారి కొత్తగా ట్రై చేసి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో పూర్తి స్థాయి తెలంగాణా భాషలో మాట్లాడనున్నాడు నేచురల్ స్టార్. ఇందుకోసం హోం వర్క్ చేస్తున్నాడు.

శ్రీకాంత్ ఒదెల దర్శకుడిగా పరిచయం అవ్వనున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ మ్యూజిక్ అందిస్తున్నాడు. మ్యూజిక్ పరంగానూ ఈ సినిమా కోసం కొత్తగా ట్రై చేస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని. ఆ సినిమా వచ్చిన కొన్ని నెలలకే ఈ సినిమాతో మళ్ళీ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.