Nandamuri Balakrishna speech at ‘Urvasivo Rakshasivo’ Event

Monday,October 31,2022 - 11:22 by Z_CLU

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో అల్లు శిరీష్, అను ఇమ్మానుయెల్ జంటగా 'విజేత' సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వంలో జీఏ-2 పిక్చర్స్‌ ధీరజ్ మొగిలినేని నిర్మించిన సినిమా “ఉర్వశివో రాక్షసివో”.  నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు సంబంధించి భారీ స్థాయిలో ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. నందమూరి బాలకృష్ణ  ముఖ్య అతిధిగా హాజరై ట్రైలర్ లాంచ్ చేసి టీంకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. "ఇక్కడకు వచ్చిన  దర్శకులు అందరూ  ఇప్పుడున్న ట్రెండ్ కు తగ్గట్టు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తూ వారిని వారే ఆవిష్కరించుకుంటూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు.  అల్లు వారి ఫ్యామిలీ తో  మాకు ఎంతో తత్సంబంధాలు ఉన్నాయి .  అల్లురామలింగయ్య  గారితో కొన్ని సినిమాలలో నటించే  అదృష్టం కూడా నాకు దక్కింది. యాక్టింగ్ పరంగా నన్ను మించిన వాడు లేడనే గర్వం ఉండకూడదు. అలా లేనందుకే వారు  ఎన్నో సినిమాలు చేశారు. అల్లు అరవింద్ గారు  గీతా ఆర్ట్స్ ను స్థాపించి పెద్ద  స్థాయికి తీసుకు వచ్చారు. దీనికోసం తను చాలా కష్టపడ్డాడు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక  స్త్రీ ఉంటుంది అంటారు. ఒక కుటుంబాన్ని నిలబెట్టాలన్న కూల్చాలాన్నా ఆ కుటుంబ బరువు బాధ్యతలు  వారి చేతుల్లోనే ఉంటుంది. అయితే ప్రస్తుతం యూత్ అభిరుచులు మారుతున్నాయి.. సహజీవనం, ఎఫైర్స్ అనేవి నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించేలా దర్శక, నిర్మాతలు కృషి చెయ్యాలి. ఈ సినిమాకు అచ్చు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అనూప్ పాడిన పాట బాగుంది. అల్లు శిరీష్, అను లు సినిమాకు తగ్గట్టు చాలా బాగా యాక్టింగ్ చేశారు. దర్శకుడు  తీసిన విధానం  బాగుంది హీరో హీరోయిన్ లా నుండి అద్భుతమైన నటనను రాబట్టుకున్నాడు. 'ఊర్వశివో రాక్షసివో' సినిమా ట్రైలర్ చూస్తుంటే   కలర్ ఫుల్ గా రొమాంటిక్ గా కనిపిస్తుంది. అందుకే ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 అయితే దాన్ని నవంబర్ 4 కు మార్చాల్సి వస్తుందేమో అనిపించింది (నవ్వుతూ).. నాకు  ఇలాంటి చిత్రాల్లో నటించాలని ఉంటుంది. కాకపోతే  నా అభిమానులు, ప్రేక్షకులకు నచ్చనిది, వాళ్లపై బలవంతంగా రుద్దాలనుకోను. నవంబర్ 4 న విడుదల అవుతున్న సినిమా చిత్ర యూనిట్ అందరికీ  పెద్ద విజయం  సాదించాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

   
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics