NagaShaurya’s Lakshya Movie Shooting Update

Monday,January 25,2021 - 02:10 by Z_CLU

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ల‌క్ష్య`. సోనాలి నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై ప్ర‌ముఖ నిర్మాత‌లు నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్ర‌లో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నాడు. నాగ‌శౌర్య 20వ చిత్రంగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.

ప్ర‌స్తుతం ఈ సినిమా ఫైన‌ల్ షెడ్యూల్ లో ఉంది. మరికొన్ని రోజుల్లో టోటల్ షూటింగ్ పూర్తి కాబోతోంది. కాలభైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.