Nagashaurya’s 20th Movie Titled ‘Lakshya’!

Monday,November 30,2020 - 05:46 by Z_CLU

యంగ్‌ హీరో  Nagashaurya , సంతోష్‌ జాగర్లపూడి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమాకు 'Lakshya' అనే టైటిల్ ని ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ పోస్ట‌ర్‌లో నాగ‌శౌర్య సూపర్ ఫిట్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. సోనాలి నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై ప్ర‌ముఖ నిర్మాత‌లు నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్ర‌లో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు.నాగ‌శౌర్య కెరీర్‌లో 20వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ నుండి ఇప్ప‌టికే విడుద‌ల‌ చేసిన స్ట‌న్నింగ్‌ ఫస్ట్‌లుక్ అంద‌రినీ థ్రిల్ చేసింది. ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ సినిమాగా క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటివలే ప్రారంభమైంది. వచ్చే ఏడాది లక్ష్య థియేటర్స్ లోకి రానుంది.