Nagarjuna’s The Ghost Killing Machine Released

Sunday,July 10,2022 - 11:06 by Z_CLU

నాగార్జున ‘ది ఘోస్ట్ ‘ చిత్రం ప్రమోషన్‌ మొదలైంది. ఈ చిత్రం నుండి కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ లో నాగార్జున, తనపైకి వచ్చిన ఓ గుంపుని కత్తులతో తెగనరకడం చాలా స్టైలిష్, యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. నాగార్జున చాలా ఎగ్రెసివ్ గా, యాక్షన్ లుక్ లో కనిపించాడు. యువ సంగీత దర్శకులు భరత్ – సౌరభ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్ కు ఓ కిక్ తెచ్చిపెట్టింది.

క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ మినహా దాదాపు పూర్తి కావచ్చింది. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని తాజాగా విడుదల చేసిన వీడియో ద్వారా మేకర్స్ ప్రకటించారు. నాగార్జున నటించిన కల్ట్ క్లాసిక్, పాత్ బ్రేకింగ్ మూవీ ‘శివ’ కూడా 1989లో అదే తేదీన విడుదల కావడం విశేషం.

‘ది ఘోస్ట్ ‘లో మేజర్ హైలెట్ యాక్షన్ అంటున్నాడు నాగ్. దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్ ని అద్భుతంగా తీశాడట. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు టెర్రిఫిక్ గా ఉంటాయని, తను ట్రైనింగ్ తీసుకొని మరీ యాక్షన్ సీన్స్ చేశానని చెప్పుకొచ్చారు. ఇలాంటి యాక్షన్ గతంలో చేయలేదని, చాలా కొత్తగా ఉందని అంటున్నాడు.

ఈ సినిమాలో ఘోస్ట్ అంటే దెయ్యం అని కాదు. స్టైలిష్ ఇంటర్ పోల్ ఏజెంట్ విక్రమ్ కి కోడ్ నేమ్ ఇది. నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.