Nagarjuna’s Bangarraju Trailer Review

Tuesday,January 11,2022 - 06:48 by Z_CLU

అసలైన సంక్రాంతిని మోసుకొచ్చాడు బంగార్రాజు. కొద్దిసేపటి కిందట ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. ట్రయిలర్ లో సంక్రాంతి ఫ్లేవర్ కొట్టొచ్చినట్టు కనిపించింది. పల్లె వాతావరణం, పండగ, రంగులు, యాక్షన్, సెంటిమెంట్, గ్లామర్, మాస్.. ఇలా ఒకటేంటి.. ట్రయిలర్ చూస్తే ఈ సంక్రాంతికి పెర్ ఫెక్ట్ మూవీ అనిపించుకుంది బంగార్రాజు.

టీజర్ లో కొన్ని విషయాల్ని టచ్ చేసిన మేకర్స్, ట్రయిలర్ తో సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. నాగచైతన్య, నాగార్జున పాత్రలు ఎలా ఉండబోతున్నాయనే విషయంతో పాటు.. రమ్యకృష్ణ, కృతి షెట్టి పాత్రలపై కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. చూస్తుంటే.. సినిమాలో నాగ్ కంటే చైతన్యకే స్క్రీన్ ప్రజెన్స్ ఎక్కువగా ఉన్నట్టుంది.

ఈ సంగతి పక్కనపెడితే, ట్రయిలర్ మొత్తం కలర్ ఫుల్ గా ఉంది. చైతూ మాస్ లుక్ అదిరింది. బంగార్రాజుగా నాగ్ ఎప్పట్లానే అదరగొట్టారు. పల్లెటూరి పిల్లలా కృతిశెట్టి చక్కగా సెట్ అయింది. అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

టీజర్ లో ఇంట్రడ్యూస్ చేసినట్టే, ట్రయిలర్ లో కూడా మరికొన్ని పదప్రయోగాలు చేశారు. వాటికి అర్థాలేంటో తెలియాలంటే.. 14వ తేదీన బంగార్రాజు సినిమా చూడాల్సిందే. ఈ ఏడాది సిసలైన సంక్రాంతి గిఫ్ట్ గా వస్తోంది బంగార్రాజు.