Nagarjuna’s Bangarraju is all set to release on January 14

Thursday,January 06,2022 - 01:31 by Z_CLU

Nagarjuna's Bangarraju is all set to release on January 14

ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ అయింది. రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా పడింది. సంక్రాంతి బాక్సాఫీస్ బోసిపోయిందని అనుకుంటున్న టైమ్ లో బుల్లెట్ పై దూసుకొచ్చాడు బంగార్రాజు. అవును.. నాగార్జున హీరోగా నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి షెడ్యూల్ అయింది. ఈ సినిమాను జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

bangarraju

బంగార్రాజు సినిమా ఎప్పుడు రెడీ అయినప్పటికీ సంక్రాంతికే విడుదల చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు నాగ్. ఎందుకంటే, ఇది పండగ లాంటి సినిమా. మరీ ముఖ్యంగా సంక్రాంతి సినిమా. అందుకే ఈ ఏడాది సంక్రాంతి మిస్ అయితే, వచ్చే ఏడాది సంక్రాంతికే సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేయాలనుకున్నారు.

కానీ అన్నీ కలిసొచ్చాయి. రికార్డ్ టైమ్ లో బంగార్రాజు షూటింగ్ పూర్తయింది. శరవేగంగా గ్రాఫిక్ వర్క్ జరిగింది. రాత్రికిరాత్రి సెట్ వర్క్స్ పూర్తయ్యాయి. కాల్షీట్లు కళ్లముందు సెట్ అయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ సైమల్టేనియస్ గా జరిగింది. ప్రమోషన్ అయితే క్లాప్ కొట్టిన మొదటి రోజు నుంచి నడిచింది. ఇలా బంగార్రాజు సినిమా రికార్డ్ టైమ్ లో రెడీ అయి సంక్రాంతి ఎట్రాక్షన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

bangarraju

సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్ గా రాబోతోంది బంగార్రాజు సినిమా. మూవీకి సంబంధించి ఇప్పటికే రిలీజైన టీజర్ సూపర్ డూపర్ హిట్టయింది. ఇక త్వరలోనే ట్రయిలర్ కూడా రాబోతోంది. ఈ పండక్కి సంక్రాంతి సోగ్గాడు అనిపించుకునేది నాగ్ మాత్రమే అనేది దాదాపు ఫిక్స్.

నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ సినిమాకు కల్యాణ్ కృష్ణ దర్శకుడు. అనూప్ రూబెన్స్ అద్భుతమైన పాటలు అందించాడు. అన్నపూర్ణ స్టుడియోస్, జీ స్టుడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జనవరి 14 నుంచి థియేటర్లలో మోత మోగించబోతోంది.