Nagarjuna will finish 2 movies at a time

Wednesday,August 04,2021 - 12:09 by Z_CLU

కింగ్ నాగార్జున స్పీడు పెంచబోతున్నాడు. అవును ఒకేసారి రెండు సినిమాలను ఫినిష్ చేసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో థియేటర్స్ లోకి రావాలని భావిస్తున్నాడు. ఇప్పటికే ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నాగ్ నటిస్తున్న సినిమాకు సంబంధించి మొదటి షెడ్యుల్ పూర్తయింది. ఈరోజు నుండి రెండో షెడ్యుల్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ లో షామీర్ పేట్ లో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. కాజల్ కూడా జాయిన్ అయింది.

ఈ సినిమాతో పాటే తన సొంత బేనర్ లో తెరకెక్కనున్న 'బంగార్రాజు' సినిమాను కూడా సెట్స్ పై పెట్టేందుకు రెడీ అవుతున్నాడు నాగ్. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా 'సోగ్గాడే చిన్ని నాయన'కి సీక్వెల్. ఐదేళ్ళ క్రితం 'సోగ్గాడే చిన్ని నాయన' మంచి వసూళ్ళు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నాగార్జున. అప్పటి నుండే ఈ సీక్వెల్ పై దృష్టి పెట్టి స్క్రిప్ట్ రెడీ చేయించుకున్నాడు.

ఆగస్ట్ 20 నుండి బంగార్రాజు షూటింగ్ మొదలు కానుందని, ఇందుకోసం ఇంద్రలోకం సెట్ కూడా రెడీ చేస్తున్నారని తెలుస్తుంది. ముందుగా ఇంద్రలోకం సెట్ లో కొన్ని సన్నివేశాలు తీసి అనంతరం ఈస్ట్ గోదావరిలో కొన్ని లోకేషన్స్ లో షూట్ చేస్తారని సమాచారం. ఇక ఈసారి రమ్యకృష్ణ కాకుండా శ్రియని కన్సిడర్ చేస్తున్నారని ఇన్సైడ్ టాక్. ఇక ఇందులో నాగచైతన్య ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తాడని చైతు సరసన కృతి శెట్టి హీరోయిన్ గా కనిపించనుందని టాక్.

ఇక ఓ సందర్భంలో 'బంగార్రాజు' సంక్రాంతి సినిమా అని.... సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ఉంటేనే దాన్ని మొదలు పెడతానని చెప్పుకున్నాడు నాగ్. మరి ఇప్పుడు వచ్చే సంక్రాంతి కి ఈ సీక్వెల్ ని రెడీ చేసి టఫ్ కాంపిటిషణ్ లో రిలీజ్ చేస్తాడా ? లేదా సమ్మర్ టార్గెట్ గా సినిమాను రెడీ చేస్తారా ? తెలియాల్సి ఉంది.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics