Nagarjuna Wild Dog to release on April 2nd

Monday,March 01,2021 - 05:45 by Z_CLU

లెక్కప్రకారం ఓటీటీలో రిలీజ్ అవ్వాలి వైల్డ్ డాగ్ మూవీ. కానీ ఇప్పుడీ సినిమా థియేటర్లలోకి వస్తోంది. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది.

వైల్డ్ డాగ్ కోసం ప్రెస్ మీట్ పెట్టాడు నాగ్. తమ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడం లేదని, ఎక్స్ క్లూజివ్ గా థియేటర్లలోకి వస్తుందని అన్నాడు. ఏప్రిల్ 2న వైల్డ్ డాగ్ మూవీ రిలీజ్ అవుతుందని ఎనౌన్స్ చేశాడు.

హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ బ్యాక్ డ్రాప్ తో వైల్డ్ డాగ్ సినిమా తెరకెక్కిందని ప్రకటించిన నాగ్, సినిమాలో తను ఎన్ఐఏ ఏజెంట్ గా కనిపిస్తానని అన్నాడు.

మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వస్తున్న ఈ సినిమాతో అహిషోర్ సాల్మ‌న్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. దియా మీర్జా హీరోయిన్ గా నటించింది. తమన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.