Nagarjuna Video about Wild dog from Manali

Friday,October 23,2020 - 06:47 by Z_CLU

అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'వైల్డ్ డాగ్‌'. ఇది మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మాణ‌మ‌వుతోన్న 6వ చిత్రం. అహిషోర్ సాల్మ‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మ‌నాలీలో ఉన్న సుంద‌ర ప్ర‌దేశాల్లో ఇటీవ‌లే మొద‌లైంది. నాగార్జున షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. అక్క‌డి ప్ర‌కృతి సౌంద‌ర్యానికి ఆయ‌న ప‌ర‌వ‌శించిపోయారు. ప్రేక్ష‌కుల‌తో ఆ ఆనందాన్ని ఓ వీడియో ద్వారా పంచుకున్నారు.

[video width="1280" height="720" mp4="http://admin.zeecinemalu.com/wp-content/uploads/2020/10/nagarjuna-wild-dog-manali.mp4"][/video]

బ్లాక్ డ్ర‌స్‌, బ్లాక్ గాగుల్స్‌, బ్లాక్ గ్లౌజెస్ ధ‌రించిన నాగ్.. మ‌న్మ‌థుడు అని ప్రేక్ష‌కులు ఇచ్చిన బిరుదుకు త‌గ్గ‌ట్లుగా హ్యాండ్స‌మ్‌గా, ఎంతో ఫిట్‌గా, మరెంతో ఎన‌ర్జిటిక్‌గా క‌నిపిస్తున్నారు. సుదీర్ఘంగా కొన‌సాగే ఈ షెడ్యూల్‌లో నాగార్జునతో స‌హా ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజ‌య్ వ‌ర్మ‌గా నాగార్జున ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని విభిన్న త‌ర‌హా పాత్ర‌ను చేస్తున్నారు. క్రిమిన‌ల్స్‌ను నిర్దాక్షిణంగా డీల్ చేసే విధానం వ‌ల్ల సినిమాలో ఆయ‌న‌ను 'వైల్డ్ డాగ్' అని పిలుస్తుంటారు. నాగార్జున జోడీగా దియా మీర్జా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో స‌యామీ ఖేర్ క‌నిపించ‌నున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిర‌ణ్ కుమార్ సంభాష‌ణ‌లు రాస్తుండ‌గా, షానీల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సాంకేతిక బృందం: ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: అహిషోర్ సాల్మ‌న్‌ నిర్మాత‌లు:  నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి స‌హ నిర్మాత‌లు: ఎన్‌.ఎం. పాషా, జ‌గ‌న్మోహ‌న్ వంచా సినిమాటోగ్ర‌ఫీ:  షానీల్ డియో యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌:  డేవిడ్ ఇస్మ‌లోన్‌ డైలాగ్స్‌:  కిర‌ణ్ కుమార్‌ ఎడిటింగ్‌:  శ్రావ‌ణ్ క‌టిక‌నేని ఆర్ట్‌:  ముర‌ళి ఎస్‌.వి. స్టంట్ కో-ఆర్డినేట‌ర్‌:  జాషువా పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్