Nagarjuna New Movie Shooting Update

Tuesday,August 03,2021 - 03:04 by Z_CLU

కింగ్ నాగార్జున‌, డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ సత్తారు కాంబినేష‌న్‌లో హై రేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యుల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ అప్ డేట్స్ ఇచ్చారు మేకర్స్. మొన్నటి వరకు ఈ సినిమా క్యాన్సల్ అయిందనే టాక్ నడిచింది. అయితే మేకర్స్ మాత్రం వాటిపై స్పందించకుండా ఇప్పుడు షూటింగ్ డీటెయిల్స్ తో సినిమా క్యాన్సల్ అవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై నారాయ‌ణ్ దాస్ కె.నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు, శ‌ర‌త్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా గోవాలో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ మంగ‌ళ‌వారం (ఆగ‌స్ట్ 4) నుంచి హైద‌రాబాద్‌లో ప్రారంభం కానుంది. షామీర్ పేట్ లో రేపటి నుండి కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.

ఇండియాలోని ప్ర‌ధాన న‌గ‌రాలు, విదేశాల్లో కీల‌క‌మైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేలా మేకర్స్ ప్లాన్ చేశారు. నాగార్జున ఈ చిత్రంలో ఔట్ అండ్ ఔట్‌ యాక్ష‌న్ ప్యాక్డ్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడు. ఇందులో నాగ్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉండనుంది. తొలి సారి నాగ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది కాజ‌ల్ అగ‌ర్వాల్. గుల్ ప‌నాంగ్‌, అనైకా సురేంద్ర‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ముకేశ్.జి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి బ్ర‌హ్మ క‌డ‌లి ఆర్ట్‌, రాబిన్ సుబ్బు, న‌భా మాస్ట‌ర్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్స్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

సినిమా షూట్ కంప్లీట్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఎక్కువ సమయం తీసుకోనున్నాడట ప్రవీణ్ సత్తారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics