Nagarjuna blackmails Taman for Wild Dog

Monday,March 29,2021 - 05:17 by Z_CLU

టాలీవుడ్ లో ట్రబుల్ షూటర్ లాంటివాడు తమన్. చాలా తక్కువ టైమ్ లో చకచకా ట్యూన్స్ ఇవ్వాలన్నా, సినిమాలకు రీ-రికార్డింగ్ పూర్తిచేయాలన్నా తమన్ తర్వాతే ఎవరైనా. అందుకే వైల్డ్ డాగ్ సినిమా కోసం తమన్ ను తీసుకున్నాడు నాగ్. అయితే సమయం మరీ తక్కువ ఉండడంతో బ్లాక్ మెయిల్ చేయాల్సి వచ్చిందన్నాడు.

"విత్ అవుట్ మ్యూజిక్ ఫస్ట్ కాపీ వచ్చింది. అయితే ఈ చిత్రానికి క్లాసిక్ మ్యూజిక్, పాప్ మ్యూజిక్ కలిపితే నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తుందని అనిపించింది. అప్పుడే క్రాక్ సినిమా చూశాను. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్లే సినిమా అంతపెద్ద హిట్ అయింది. వైల్డ్ డాగ్ సినిమా కోసం తమన్‌ను తీసుకోవాలని ఫ్యామిలీ పరంగా ఫ్లాష్ బ్యాక్‌ చెప్పి బ్లాక్ మెయిల్ చేశాను. మూడు వారాలే ఉంది సినిమా చేసి పెట్టమని అడిగాను. తమన్ తన సంగీతంతో సినిమాను ఎక్కడో నిలబెట్టేశారు"

ఇలా వైల్డ్ డాగ్ సినిమా కోసం ఆఖరి నిమిషంలో తమన్ వచ్చి చేరిన విషయాన్ని నాగార్జున బయటపెట్టాడు. `వైల్డ్‌డాగ్ బేస్ క్యాంప్` పేరుతో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను నిన్న సెలబ్రేట్ చేశారు. ఈ ఫంక్షన్ లో తమన్ ను బ్లాక్ మెయిల్ చేసిన విషయాన్ని బయటపెట్టాడు నాగ్.