NagaChaitanya’s Love Story Teaser to release on 10th January

Friday,January 08,2021 - 12:59 by Z_CLU

ప్లెజంట్ ప్రేమ కథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న మరో ఆహ్లాదకర సినిమా ''లవ్ స్టోరి''. ఈ అందమైన ప్రేమ కథలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు.

ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.‘‘ఫిదా’’ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమాకావడం, నాగ చైతన్య-సాయిపల్లవి లాంటి స్టార్ కాస్టింగ్ ఉండటం ఈ ఎక్స్ పెక్టేషన్స్ కు కారణం.

ఇక ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్ అప్ డేట్ రానే వచ్చింది. జనవరి 10 ఉదయం 10:08 గంటలకు ‘‘లవ్ స్టోరీ’’ టీజర్ రాబోతుంది. ఈ అనౌన్స్ మెంట్ కు సంబంధించి ఓ లవ్ లీ పోస్టర్ ను వదిలింది టీమ్.

ఈ పోస్టర్ లో నాగచైతన్య చెవిలో సాయి పల్లవి ఏదో చెబుతోంది.చూడ ముచ్చటగా ఉన్న ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు.